: ఆ ఇద్దరి వల్లే ‘జనతా గ్యారేజ్’కు ఎక్కడలేని హైప్ వచ్చేసింది: కొరటాల శివ


మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ ఇద్దరి వల్లే ‘జనతా గ్యారేజ్’ సినిమాకు ఎక్కడ లేని హైప్ వచ్చేసిందని ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ అన్నారు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇంత పెద్ద స్టార్లను ఒకే ఫ్రేమ్ లో చూపించడం, వాళ్లతో కలిసి పనిచేసిన అనుభూతి చాలా అద్భుతమన్నారు. వాళ్లిద్దరితో కలిసి సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడికి అనిపిస్తుందని, కేవలం ఆ ఇద్దరి వల్లే జనతా గ్యారేజ్ చిత్రానికి ఇంత హైప్ వచ్చిందని అన్నారు. ఈ చిత్రం కథను కేవలం జూనియర్ ఎన్టీఆర్ కోసమే రాశానని అన్నారు. ఇంతకు ముందెవరూ స్క్రీన్ పై చూపించని విధంగా జూనియర్ ఎన్టీఆర్ ని చూపిస్తున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News