: దాసరితో ముద్రగడ భేటీ!... కాపు రిజర్వేషన్లపై కీలక చర్చ!
ఏపీలో కాపులకు రిజర్వేషన్ల కోసం పోరు బాట పట్టిన కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోమారు ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టే ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులతో ఈ అంశంపై చర్చించేందుకు నిన్న హైదరాబాదు చేరుకున్న ముద్రగడ... కాసేపటి క్రితం టాలీవుడ్ దర్శకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దాసరి నారాయణరావుతో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని దాసరి నివాసానికి వెళ్లిన ముద్రగడ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు సర్కారు రోజుకో మాట మాట్లాడుతోందని ముద్రగడ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన దాసరి వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఇక మరికాసేపట్లో ముదగ్రడ... మెగాస్టార్ చిరంజీవితోనూ భేటీ కానున్నారు.