: ధోనీకి చేయిచ్చేసిన పెప్సీ!... 11 ఏళ్ల బంధానికి తెర!
టీమిండియా పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో 11 ఏళ్లుగా కొనసాగిస్తున్న వాణిజ్య బంధానికి బహుళ జాతి సంస్థ పెప్సీకో గుడ్ బై చెప్పేసింది. 2005లో ధోనీని తన బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసిన పెప్సీకో... 11 ఏళ్ల పాటు ఆ బంధాన్ని కొనసాగించింది. తాజాగా టెస్టు కెరీర్ కు గుడ్ బై చెప్పేసిన ధోనీ... వన్డే, టీ20 జట్లకు మాత్రమే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో అతడి వాణిజ్యపరమైన ప్రాభవం కూడా క్రమంగా తగ్గిపోతోంది. ఇందుకు నిదర్శనంగానే అతడితో బంధాన్ని పెప్సీకో తెంచుకుంది.