: బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కల్యాణ్ కుంభకర్ణుడిలా నిద్రపోయాడు: టీజీ వెంక‌టేశ్


జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై టీడీపీ రాజ్యసభ స‌భ్యుడు టీజీ వెంకటేశ్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌వ‌న్ ఇప్ప‌టికైనా త‌న ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చుకోవాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జ‌న‌సేనాని కుంభకర్ణుడిలా నిద్రపోయార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇప్పుడు లేచి ప్ర‌త్యేక‌హోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాల‌న‌డం ఆయ‌న‌ అవివేకానికి నిద‌ర్శ‌నమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎంపీల‌పై ప‌వ‌న్ చేసింది చౌక‌బారు విమ‌ర్శ‌లని టీజీ వెంకటేశ్ మండిప‌డ్డారు. రాజకీయం చేయ‌డ‌మంటే నెల‌నెలా జీతం తీసుకున్న‌ట్లు కాదని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్య‌లు త‌మిళ‌నాడులో చేస్తే ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత కాళ్లు, చేతులు విర‌గ్గొట్టించేవార‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News