: ప్రతిరోజూ గాంధీభవన్ కు వెళుతున్న నాయకులు ఏం చేస్తున్నారు?: రేణుకా చౌదరి


ప్రతిరోజూ గాంధీ భవన్ కు వెళ్తున్న నాయకులు ఏమి చేస్తున్నారు, వాళ్ల ప్రోగ్రెస్, డెవలప్ మెంట్ ఏమిటో చెప్పండి? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి ప్రశ్నించారు. ఒక టీవీ ఛానెల్ లో అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా సమాధానం చెప్పారు. రోజూ గాంధీ భవన్ కు వెళితేనే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తా? లేకపోతే కాదా? అని ఆమె ప్రశ్నించారు. అదీగాక, తాను ఎంపీని కనుక ఢిల్లీలో చాలా పనులు ఉంటాయని అన్నారు. కమిటీలు, టూర్లు ఉంటాయని, ఇతర రాష్ట్రాల బాధ్యతలను తమకు అప్పజెబుతారని, ఇటువంటి సందర్భాల్లో అష్టావధానాలు చేయలేం కదా? అని ఆమె అన్నారు. ‘హైకమాండ్ తో ఉన్న సత్సంబంధాల వల్ల రాష్ట్ర నాయకత్వాన్ని మీరు ఖాతర్ చేయరు’ అనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, తనకు హైకమాండ్ తో సంబంధాలున్నట్లు తానెప్పుడూ చెప్పలేదని, ఈవిధంగా మాట్లాడటం తనను అవమానించడమా లేక హైకమాండ్ ను అవమానించడమా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News