: రోహిత్ అర్ధసెంచరీ... టీమిండియా దూకుడు
అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ ఆటగాళ్లు 245 పరుగుల భారీ స్కోరు చేసి, అమెరికన్లకు క్రికెట్ మజాను రుచిచూపారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడుతూ, తమలో పదును తగ్గలేదని నిరూపించింది. ప్రధానంగా ఓపెనర్ రోహిత్ శర్మ (62) వీరబాదుడు బాదుతుంటే...అతనికి కేఎల్ రాహుల్ (51) జత కలిశాడు. వీరిద్దరి దూకుడుతో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 11.3 ఓవర్లలో 137 పరుగులు చేసింది.