: ట్ర‌క్కు డ్రైవింగ్ చేస్తూ పోకెమాన్ గో ఆడిన వ్యక్తి.. ఒక‌రి మృతి


పోకెమాన్‌ గో ఆడుతూ ఎంతో మంది ప్ర‌మాదాల బారిన ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నో ప్ర‌మాదాలు జ‌రుగుతోన్న ఘ‌ట‌న‌లు వెలుగులోకొస్తున్నా స్మార్ట్ ఫోన్ వినియోగ‌దాదులు ఆ పిచ్చి నుంచి బ‌య‌టప‌డ‌లేక‌పోతున్నారు. పోకెమాన్ గో ఆడుతూ ఓ ట్రక్కు డ్రైవర్‌ ఇద్దరిని ఢీకొట్టిన ఘ‌ట‌న తాజాగా జపాన్‌లో చోటుచేసుకుంది. ప్ర‌మాదంలో ఒకరు మృతిచెంద‌గా, మరొకరికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన ట్ర‌క్కు డ్రైవర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోకెమాన్‌ గో గేమ్‌ ఆడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నింటెండో సంస్థ అధికారి ఒకరు సూచించారు. డ్రైవింగ్ చేస్తోన్న వారు ఈ ఆట ఆడకుండా క‌ట్ట‌డి చేయడానికి ఆ గేమ్‌కి పాప్ యాప్‌ని జోడించనున్నట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News