: తిరుపతికి నేడు పవన్ కల్యాణ్!... హత్యకు గురైన అభిమాని కుటుంబానికి పరామర్శ!
టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరుపతికి వెళ్లనున్నారు. టాలీవుడ్ కే చెందిన యంగ్ హీరో అబిమానుల చేతిలో ఇటీవల హత్యకు గురైన తన అభిమాని వినోద్ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ఆదివారం కర్ణాటక పరిధిలోని కోలార్ లో పవన్ కల్యాణ్, టాలీవుడ్ యంగ్ హీరో అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో తిరుపతికి చెందిన వినోద్ చనిపోయిన సంగతి తెలిసిందే. మరునాడే విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. తాజాగా వినోద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన తిరుపతి వెళుతున్నారు.