: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈరోజు స్టాక్ మార్కెట్లు మందకొడిగా సాగాయి. సెన్సెక్స్ 5 పాయింట్లు లాభపడి 27,990 వద్ద, నిఫ్టీ 3 పాయింట్లు లాభపడి 8,632 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈ లో హెచ్సీఎల్ టెక్నాలజీస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడియా, ఇన్ఫోసిస్, టీసీఎస్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. భారత్ పెట్రోలియం, టాటా పవర్, ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్, అరబిందో ఫార్మా సంస్థల షేర్లు నష్టాలు చవిచూశాయి.