: కరాచీలో టీవీ ఛానల్‌పై దాడి చేసిన రెండు వేల మంది.. ఒక ఉద్యోగి మృతి


రెండువేల మంది ఉద్య‌మకారులు ఒక టీవీ ఛానల్‌పై దాడి చేసిన ఘ‌ట‌న పాకిస్థాన్‌లోని క‌రాచీలో చోటుచేసుకుంది. ముత్తాహిదా ఖామీ ఉద్యమం (ఎమ్‌క్యూఎమ్‌) పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డం ప‌ట్ల రెండు వేల మంది ఉద్య‌మకారులు ఆందోళ‌న తెలిపారు. అయితే, వారి ఆందోళ‌న‌ను స్థానిక ఏఆర్‌వై టీవీ ఛానల్‌లో చూపించ‌క‌పోవ‌డం ప‌ట్ల వారు ఆగ్ర‌హానికి గుర‌య్యారు. దీంతో వారంతా క‌లిసి కరాచీలోని మదీనా షాపింగ్‌మాల్‌లో ఉన్న స‌ద‌రు ఛాన‌ల్‌ కార్యాలయంపై దాడికి పాల్ప‌డ్డారు. ఒక్క‌సారిగా అంత‌మంది అక్క‌డ‌కు వచ్చి, దాడికి దిగడంతో తొక్కిస‌లాట జ‌రిగింది. దీంతో ఓ ఉద్యోగి మృతి చెందాడు. వెంట‌నే పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చి, ఉద్య‌మ‌కారుల‌ను అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన ఆ దేశ ప్ర‌ధాని న‌వాజ్‌ష‌రీఫ్ ఛానల్ పై జరిగిన దాడిని ఖండించారు.

  • Loading...

More Telugu News