: ఏపీ అభివృద్ధి చెందే దాకా కేంద్రం చేయూత ఇవ్వాల్సిందే!... శ్రీశైలంలో చంద్రబాబు కామెంట్
దేశంలోని అన్ని రాష్ట్రాల స్థాయిలో అభివృద్ధి చెందేదాకా నవ్యాంధ్రకు కేంద్రం చేయూతనందించాల్సిందేనని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. నేటి మధ్యాహ్నం శ్రీశైలంలో కొనసాగుతున్న కృష్ణా పుష్కరాలను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రబాబు... అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందేదాకా కేంద్రం చేయాల్సిన సాయంపై రాజీ పడే ప్రసక్తే లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా పుష్కరాలపై ప్రజలంతా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నా... కొందరు మాత్రం పనిగట్టుకుని విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా ఆయన అన్నారు.