: కారు ప్రమాదంలో కేంద్ర మంత్రికి, తిరంగ యాత్రలో బీజేపీ ఎంపీకి గాయాలు


కారు ప్రమాదంలో కేంద్ర మంత్రి ప్రతాప్ రూఢీకి స్వల్ప గాయాలయ్యాయి. బీహార్ లోని ఛాప్రాలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం ఈరోజు మధ్యాహ్నం పాట్నాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మంత్రిని పాట్నాలోని ఆసుపత్రికి తరలించామని, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని పేర్కొన్నారు. కాగా, అస్సాంలోని తిరంగా యాత్రలో పాల్గొన్న బీజేపీ ఎంపీ కామాఖ్య ప్రసాద్ తన బైక్ అదుపుతప్పడంతో కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News