: అమెరికా గడ్డపై తొలి తెలుగు వర్సిటీ!... జనవరిలో ప్రారంభించనున్న చంద్రబాబు!


అమెరికా గడ్డపై తొలి తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యరంగం సిద్ధమైపోయింది. అమెరికాలోని ప్రవాస తెలుగు ప్రజలకు సంబంధించిన ప్రముఖ సంస్థ సిలికానాంధ్ర ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తోంది. జనవరిలో ఈ వర్సిటీ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. సిలికాన్ వ్యాలీలోని మిల్ పిటాస్ లో ఈ వర్సిటీ కోసం సిలికానాంధ్ర ఇప్పటికే ఓ విశాల భవంతిని కొనుగోలు చేసింది. తొలుత సంగీతం, నాట్యం వంటి కోర్సులతో ప్రారంభం కానున్న ఈ వర్సిటీలో దశలవారీగా తెలుగు కోర్సులతో పాటు, అమెరికాలోని అన్ని రకాల కోర్సులను ప్రారంభించనున్నట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. ఈ వర్సిటీని జనవరిలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆనంద్ చెప్పారు.

  • Loading...

More Telugu News