: కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తిన ధోనీ.. అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా రాణించగలడని కితాబు
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ ఒక్క టెస్ట్ కెప్టెన్‌గా మాత్రమే కాదని, వన్డే, టీ-20లకు కూడా మంచి కెప్టెన్ కాగలడని పేర్కొన్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గెలుపు కోసమే పోరాడతాడని, గెలిచిన అన్ని మ్యాచుల్లోనూ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అతడే తీసుకోవాలని భావిస్తాడంటూ కితాబిచ్చాడు. రోజురోజుకు అతడి ఆట తీరు మరింత మెరుగుపడుతోందన్న ధోని మొత్తం మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా రాణించే సత్తా విరాట్‌కు ఉందన్నాడు. ఫిట్నెస్ విషయంలో, వ్యూహ రచనలో, ఆటను అంచనా వేయడంలో సరిగ్గా ఆలోచిస్తాడని, అదే అతడికి ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టిందని వివరించాడు.