: అంచనాలు, లెక్కలు ఏవీ పని చెయ్యవు: సినీ హీరో, బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ సుధీర్ బాబు
దేశ వ్యాప్తంగా నెలకొన్న అంచనాలు, గత రికార్డులు ఇవేవీ పని చెయ్యవని సినీ నటుడు, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ సుధీర్ బాబు తెలిపాడు. హైదరాబాదులో మాట్లాడుతూ, బ్యాడ్మింటన్ కోర్టులో దిగేంత వరకు చాలా చెప్తామని, అయితే ఒక్కసారి కోర్టులో దిగిన తరువాత ఇవేవీ గుర్తుకు రావని, ప్రత్యర్థి పంపిన షటిల్ మాత్రమే కనిపిస్తుందని అన్నాడు. విశ్లేషకులు చెప్పే వివరణలు, కుటుంబ సభ్యులు చెప్పే మాటలు ఇవేవీ కోర్టులో దిగిన తర్వాత గుర్తుండవని సుధీర్ బాబు చెప్పాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తాను చివరిసారి సింధును చూసినప్పుడు చాలా మౌనంగా ఉండేదని, అప్పటి సింధుకు, ఇప్పుడు తాను చూస్తున్న సింధుకు చాలా తేడా ఉందని చెప్పాడు. కోచ్ ఏం చెబుతున్నాడో అది మాత్రమే మైండ్ లో తిరుగుతుంటుందని, సింధుతో గోపీ ఉండడం బాగా కలిసివస్తుందని చెప్పాడు. కరొలినా మారిన్ కు అదే మైనస్ పాయింట్ అని సుధీర్ చెప్పాడు. కోర్టులో సింధుకు అన్నీ కలిసివచ్చినట్టే కనిపిస్తున్నాయని, సింధు తెచ్చే బంగారు పతకం కోసం ఎదురు చూస్తున్నానని సుధీర్ బాబు తెలిపాడు.