: మంత్రాలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాంచరణ్ భార్య ఉపాసన
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆలయాన్ని సినీ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన దర్శించుకున్నారు. రామ్ చరణ్ 'ధృవ' సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో, ఉపాసన ఒక్కరే రాఘవేంద్రస్వామి ఆలయానికి రావడం జరిగింది. కాగా, దైవదర్శనానికి వచ్చిన ఉపాసనకు పీఆర్వో ఐపీ నర్సింహమూర్తి సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంధ్రస్వామి బృందావనం దర్శనానంతరం ఉపాసన పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థస్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, ఓపక్క చిరంజీవి దంపతులు శ్రీకాకుళంలో దైవదర్శనానికి వెళ్లగా, మరోపక్క ఇదేరోజున ఉపాసన మంత్రాలయం వెళ్లడం విశేషం!