: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం...కనీసం కారు కూడా లేదు!: జోగు రామన్న
కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆరోపణలను మంత్రి జోగు రామన్న ఖండించారు. ఆదిలాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. హైదరాబాదులోని గచ్చిబౌలిలో తనకు 3 కోట్ల రూపాయల విలువైన ఇల్లుందని నిరూపిస్తే... అలా నిరూపించిన వారికే దానిని రాసిచ్చేస్తానని ఆయన సవాల్ విసిరారు. ప్రస్తుతం తాను వినియోగిస్తున్న కారు కూడా తనది కాదని, తన కుమారుడిదని ఆయన తెలిపారు. తనపై ఆరోపణలు నిరూపిస్తే ఎలాంటి శిక్ష అనుభవించేందుకైనా వెనుకాడనని ఆయన చెప్పారు.