: రాధిక ఆప్టే నా సోదరి... ఆమె న్యూడ్ సీన్లు లీక్ చేసి ప్రచారం పొందే స్థాయికి నేను దిగజారలేదు: 'పర్చేద్' నిర్మాత


బాలీవుడ్ భామ రాధికా ఆప్టే న్యూడ్ సీన్స్ బాలీవుడ్ లో పెనుకలకలం రేపుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన వారు న్యూడ్ సీన్స్ లో నటించిన ఆమె ధైర్యానికి జేజేలు పలుకుతున్నారు. ఈ వీడియోల పుణ్యమా అని 'పర్చేద్' సినిమాకు విశేషమైన ప్రచారం లభించింది. ఇంకా విడుదల కాని ఈ సినిమాలో అభ్యంతరకర సీన్లు యూట్యూబ్ లో దర్శనమీయడంతో ఈ పని ఆ సినిమా యూనిట్టే చేసి ఉంటుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఆ సినిమా నిర్మాత అసీమ్ బజాజ్ స్పందించారు. రాధికా ఆప్టే తన సోదరి లాంటిదని అన్నారు. న్యూడ్‌ సీన్లు లీక్‌ చేసి ప్రచారం పొందే స్థాయికి తామింకా దిగజారలేదని ఆయన చెప్పారు. ఈ సీన్లు చిత్రీకరించినందుకు కూడా తాము సిగ్గుపడడం లేదని ఆయన తెలిపారు. ఈ సీన్ల చిత్రీకరణ సమయంలో రాధిక తమకు చాలా సహకరించిందని ఆయన తెలిపారు. అయితే ఈ సినిమాను యూఎస్‌, ఫ్రాన్స్‌ లోని పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శించామని చెప్పిన ఆయన ఆన్ లైన్లో హల్ చల్ చేస్తున్న సీన్లు అక్కడి నుంచే లీకై ఉటాయని అనుమానిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News