: ముస్లింలెవరూ కేఎఫ్ సీ చికెన్ తినొద్దు: ఫత్వా జారీ
కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ) లో చికెన్ ను తినవద్దని ఉత్తరప్రదేశ్ లోని ముస్లిం పెద్దలు ఫత్వా జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే... కేఎఫ్ సీ ఔట్ లెట్లలో తినడం ద్వారా ముస్లింలు పాపం చేయవద్దని దర్గా-ఎ-అలా హజరత్ మత పెద్దలు పిలుపునిచ్చారు. కేఎఫ్ సీ ఔట్ లెట్లలో ఆహారంగా అందించే చికెన్ హలాల్ చేసినది కాదని స్పష్టం చేశారు. హలాల్ చేయని మాంసాన్ని తినడం షరియత్ చట్టాలకు విరుద్ధమని మౌలాని సీనియర్ ముప్తీ సలీం నూరీ తెలిపారు. హలాల్ చేయని మాంసం తినడం పాపమని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల అక్కడ తినొద్దని ఫత్వాలో పేర్కొన్నారు. కేఎఫ్ సీలో మాంసాన్ని ముస్లింల కళ్లెదుట ప్రాసెస్ చేయరని, అందువల్ల అది ఇస్లామ్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.