: ‘అనంత’లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఏపీ సీఎం!
భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఏపీ సర్కారు అధికారికంగా నిర్వహిస్తున్న వేడుకలు ఆ రాష్ట్రంలోని అనంతపురంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం విజయవాడ నుంచి బయలుదేరిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు... అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. మరికాసేపట్లో ఆయన తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని మొదలుపెడతారు.