: ఘనంగా రోశయ్య మనవడి పెళ్లి!... కేసీఆర్, వైఎస్ జగన్ సహా ప్రముఖుల హాజరు!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా పనిచేసి, ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా ఉన్న సీనియర్ రాజకీయ వేత్త కొణిజేటి రోశయ్య మనవడు అనిరుధ్ వివాహం నిన్న హైదరాబాదులోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. బొమిడాల రామకృష్ణ, అనితల కుమార్తె లక్ష్మీ ప్రదీప్తితో అతడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో రాజకీయ, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.