: నయీమ్ కేసులో ఎవరినీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు: నాయిని


కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో ఏ ఒక్కరినీ వదిలే ప్రశ్న లేదని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి తెలిపారు. హైదరాబాదు శివారు శంషాబాద్ మండలం ముచ్చింతలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ నాయకులు, అధికారులు... ఇలా నయిీమ్ తో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదని అన్నారు. నయీమ్ తో సంబంధమున్న ఎవరైనా సరే చట్టప్రకారం శిక్షించబడతారని ఆయన తెలిపారు. ఈ కేసు టేకప్ చేసిన సిట్ విచారణ వేగవంతం చేసిందని ఆయన తెలిపారు. నయీమ్ అనుచరులను ఇప్పటికే సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News