: నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాపై మాట దాటేసిన జవదేకర్!
కృష్ణా నదిలో పుష్కర స్నానం ఆచరించేందుకు విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన వేళ ఈ ఘటన జరిగింది. ప్రత్యేక హోదాపై ప్రశ్నించగా, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ముందడుగు సాధిస్తుందన్న నమ్మకం తనకుందని, పుష్కర సంకల్పంగా, నాణ్యమైన విద్య అందరికీ అందాలని కోరుకున్నానని అన్నారు. ఏపీని ఆదుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హోదా గురించి ఆయన తన నోటి వెంట ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం గమనార్హం.