: ప్రఖ్యాత పీసా టవర్ పై దాడికి కుట్ర


శతాబ్దాల చరిత్ర ఉన్న ఇటలీలోని ప్రఖ్యాత పీసా టవర్ పై దాడి చేసేందుకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇటీవల ఇటలీలోని బైలెల్ చియహోయి అనే 26 ఏళ్ల ట్యునీషియన్ వ్యక్తి యూరప్ లో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రశంసిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో అతన్ని అరెస్టు చేసి, పోలీసులు విచారణ చేపట్టగా పీసా టవర్ పై దాడి కుట్ర బయటపడిందని ఇటలీ మీడియా పేర్కొంది. ఆ వ్యక్తిని ఇటలీ నుంచి బహిష్కరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై న్యాయమూర్తి కూడా సంతకాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటలీ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఆంజెలినో అల్ఫానో ఆదేశాల మేరకు ట్యునీషియన్ వ్యక్తిని దేశం నుంచి బహిష్కరించారు.

  • Loading...

More Telugu News