: అభిమాని కోరిక తీర్చిన హీరో రామ్!...చావుకు దగ్గరైన చిన్నారిని ఇంటికెళ్లి పలకరించిన వైనం!


విశాఖకు చెందిన ఐదేళ్ల బాలిక పూర్ణచంద్రిక టాలీవుడ్ యంగ్ హీరో రామ్ కు వీరాభిమాని. పుట్టుకతోనే గుర్తు తెలియని వ్యాధితో సతమతమవుతున్న ఆ బాలిక మరెంతో కాలం బతకదట. ఈ క్రమంలో విశాఖకు వచ్చిన రామ్ ను చూడాలనుందన్న ఆ బాలిక కోరిక ఎట్టకేలకు నిన్న తీరింది. వివరాల్లోకెళితే... నగరంలోని ఎంవీపీ కాలనీకి చెందిన రవికుమార్ రెండో కుమార్తె పూర్ణచంద్రిక పుట్టిన నాటి నుంచి కాళ్లు కదపలేకపోతోంది. అంతుపట్టని వ్యాధితో సతమతమవుతున్న ఆ బాలిక ఇంకెంతో కాలం బతకదని వైద్యులు తేల్చేశారు. తన అభిమాన నటుడు విశాఖలో జరుగుతున్న షూటింగ్ లో ఉన్నాడని తెలుసుకున్న ఆ బాలిక అతడిని చూడాలనుందని తల్లిదండ్రులకు చెప్పగా... వారు యూనిట్ సభ్యులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న రామ్ నిన్న నేరుగా ఆ బాలిక ఇంటికి వెళ్లాడు. కదలలేని స్థితిలో ఉన్న బాలికను ఎత్తుకుని ఒళ్లో కూర్చోబెట్టుకుని ధైర్యం చెప్పాడు.

  • Loading...

More Telugu News