: పుష్కరాల్లో మరో అపశ్రుతి!... పానగల్ ఘాట్ లో కరెంటు షాక్ తో భక్తుడి దుర్మరణం!
కృష్ణా పుష్కరాల్లో చిన్నపాటి అపశ్రుతులు తప్పడం లేదు. నిన్న రెండు వేర్వేరు ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లలో చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఓ చిన్నారి సహా ఇద్దరు చనిపోయారు. తాజాగా నేటి ఉదయం కూడా మరో అపశ్రుతి చోటుచేసుకుంది. తెలంగాణలోని నల్లగొండ జిల్లా పానగల్ లో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో పుష్కర స్నానానికి వచ్చిన ఓ భక్తుడు అక్కడికక్కడే చనిపోయాడు. విద్యుత్ షాక్ కారణంగా జరిగిన ఈ ప్రమాదం అక్కడి భక్తులను ఉరుకులు పరుగులు పెట్టించింది.