: ఈ సినిమా నాకు స్పెషల్... షూటింగ్ ఎంతగానో ఆస్వాదించా!: కొరటాల


ఈ సినిమా తనకు స్పెషల్ అని... తాను రైటర్ గా ఇంకా పెద్దగా ఎదగని సమయంలో 'బృందావనం' సినిమాకు మాటలు రాశానని 'జనతా గ్యారేజ్' డైరెక్టర్ కొరటాల శివ గుర్తు చేసుకున్నారు. అలాంటప్పుడు తనను అభిమానులకు తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ పరిచయం చేశారని చెప్పారు. ఇక 'జనతా గ్యారేజ్' సినిమా చేస్తున్నప్పుడు తను సంపాదించుకున్న అనుభవం మర్చిపోలేనిదని ఆయన తెలిపారు. జూనియర్ నటనను చూసి...ప్రతి సీన్ కి ఛాలెంజింగ్ గా మాటలు రాస్తూ షూటింగ్ ఆస్వాదించానని ఆయన తెలిపారు. స్కూల్ లో చదువుతున్నప్పుడు మోహన్ లాల్ సినిమాలు చూస్తూ పెరిగానని, జీవితంలో ఆయనను చూస్తే చాలు.. అనుకునే తాను ఆయనకు దర్శకుడిగా 'యాక్షన్' చెప్పానని, సినీ పరిశ్రమలో అద్భుతనటులైన జూనియర్ ఎన్టీఆర్, మోహన్ లాల్ ను ఒకే ఫ్రేమ్ లో పెట్టి యాక్షన్ చెప్పానని, అంతకంటే గొప్ప విషయం ఏముంటుందని ఆయన అన్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని తాను బలంగా నమ్ముతున్నానని ఆయన తెలిపారు. ఈ సినిమాకు పని చేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News