: కృష్ణవేణి పుష్కర హారతికి హాజరైన చంద్రబాబు


కృష్ణా పుష్కరాల సందర్భంగా పవిత్ర సంగమం వద్ద కృష్ణవేణికి పురోహితుల వేదమంత్రోచ్చారణ నడుమ సాగిన హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు చినరాజప్ప, గంటా, కామినేని, ఎంపీ మురళీమోహన్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. పుష్కర స్నానాలు ప్రారంభమైన అనంతరం జరిగిన తొలి రోజు హారతి కార్యక్రమంలో ఆయన భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో పుష్కరఘాట్లకు పోటెత్తారు. చంద్రబాబు భక్తులకు అభివాదం చేయడంతో వారిలో ఉత్సాహం వెల్లువెత్తింది. సాయికుమార్ వాయిస్ ఓవర్ తో పుష్కర హారతి రక్తికట్టింది.

  • Loading...

More Telugu News