: వర్గీకరణ చేస్తే వెంకయ్యే మా దేవుడు: మంద కృష్ణ
ఎస్సీ వర్గీకరణ చేస్తే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడే తమ దేవుడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆది నుంచి ఎమ్మార్పీఎస్ కు రాజకీయ మద్దతు కూడగట్టింది వెంకయ్యనాయుడేనని అన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించినా తమకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. మాదిగ రిజర్వేషన్ డిమాండ్ చాలా కాలంగా ఉందని ఆయన గుర్తు చేశారు. వర్గీకరణ భారం మీదేనంటూ మంద కృష్ణ మాదిగ వెంకయ్యనాయుడుకు పాదాభివందనం చేశారు. కాగా, ఎస్సీ వర్గీకరణ కోరుతూ గత నెల రోజులుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.