: వనస్థలిపురం పీఎస్‌లో నయీమ్ ముఠాపై మరో ఫిర్యాదు
పోలీసుల కాల్పుల్లో నయీం హతమైన విషయం తెలిసిందే. నయీం ముఠాపై హైదరాబాదులోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో మరో ఫిర్యాదు నమోదైంది. మాజీ మావోయిస్టు కోనపురి రాములు హత్యకు సహకరించలేదని తనపై నయీమ్ ముఠా సభ్యులు దాడి చేశారని రాములు డ్రైవర్ కిరణ్ ఫిర్యాదు చేశాడు. ఆ దాడిలో తాను తృటిలో తప్పించుకోగలిగానని పోలీసులకి తెలిపాడు. తనకు ఇంకా వారి నుంచి ముప్పు పొంచే ఉందని, తనకు రక్షణ కల్పించాలని కిరణ్ పోలీసులని కోరాడు.