: 'ఆప్' ఎమ్మెల్యే ఇంట్లో రూ.130 కోట్లు పట్టివేత


ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన ఛత్తర్ పూర్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్ నివాసంపై ఐటీ అధికారులు ఈ రోజు దాడులు నిర్వహించారు. లెక్కల్లో చూపించని రూ.130 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తర్ పూర్, ఘితోర్నిలో ఫామ్ హౌస్ ల కొనుగోలుకు సంబంధించిన అకౌంట్ పుస్తకాలను, లెక్కల్లో చూపించని, బినామీ ఆస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు ఐటీ సోదాల్లో పట్టుబడినట్లు తెలుస్తోంది. కాగా, తన్వర్ కు చెందిన సౌత్ ఢిల్లీ నివాసంపై గత నెల 27న ఐటీ సోదాలు నిర్వహించింది.

  • Loading...

More Telugu News