: ఉగ్రవాదుల నుంచి విముక్తి... బురఖాలను అంటించేసి సంబరాలు చేసుకున్న ముస్లిం మహిళలు


బురఖాలను కాల్చి సంబరాలు చేసుకున్నారంటే వారెంత నరకం అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. రెండేళ్లపాటు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రపాలనలో నలిగిపోయిన సిరియాలోని మాంబిజ్ నగరాన్ని సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్‌డీఎఫ్) తిరిగి స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదులను తరిమి తరిమి కొట్టింది. ఉగ్రవాదుల పీడ విరగడైపోవడంతో స్వేచ్ఛా వాయువులు పీల్చిన ప్రజలు ఆనందంగా రోడ్లపైకి వచ్చారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. మహిళలు తమ బురఖాలకు నిప్పటించి నాట్యం చేశారు. ఉగ్రవాదుల చెరలో నగరం చిక్కుకున్న రెండేళ్లలో తామెంత నరకం అనుభవించిందీ చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులను తరిమి కొట్టిన కుర్దిష్ సేనలను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

  • Loading...

More Telugu News