: జతిన్ మెహతా... మరో మాల్యా!: నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లకు ఈడీ సిద్ధం!


దేశీయ వాణిజ్య విపణిలో మరో ఎగవేతదారు తెరపైకి వచ్చేశారు. విన్ సమ్ గ్రూప్ ప్రమోటర్ జతిన్ మెహతాకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగం సిద్ధం చేస్తోంది. విన్ సమ్ గ్రూపును ప్రారంభించిన జతిన్ మెహతా... లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మాదిరే దేశంలోని 15 బ్యాంకుల వద్ద రూ.6,800 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. తీసుకున్న రుణాల చెల్లింపులో ఆసక్తి కనబరచని మెహతా... దేశంలోనే రెండో అతిపెద్ద ఎగవేతదారుగా రికార్డులకు ఎక్కనున్నారు. ఇప్పటికే మెహతా వ్యవహారంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఏఓ) దర్యాప్తు సాగిస్తుండగా, తాజాగా రంగంలోకి దిగిన ఈడీ త్వరలోనే ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయనుంది. ఈ మేరకు రానున్న మూడు వారాల్లో పీఎంఎల్ఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న ఈడీ ఈ వారెంట్ల జారీకి రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News