: ఎక్కడ ఏం జరిగినా ప్రధానే సమాధానం చెప్పాలంటున్నారు: వెంకయ్యనాయుడు
ఢిల్లీ పాలన విషయంలో తలెత్తిన వివాదాలకు కేంద్రాన్ని తప్పుబట్టడం భావ్యం కాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా ప్రధానే సమాధానం చెప్పాలంటూ ప్రధానిపై పలువురు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిపై అనవసరంగా అటువంటి వ్యాఖ్యలు చేయడం మానేయాలని ఆయన సూచించారు. అన్ని విషయాల్లోనూ ప్రధానిని భాగస్వామ్యం చేస్తూ చూపడం సరికాదని అన్నారు.