: 13 మంది భారతీయులకు ఉరిశిక్ష విధించిన కువైట్
కువైట్ లో వివిధ రకాల నేరాలకు పాల్పడిన 13 మందికి ఉరిశిక్ష పడిందని, వీరితో పాటు మొత్తం 17 మంది భారతీయులు అక్కడి వివిధ జైళ్లలో మగ్గుతున్నారని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ లోక్ సభకు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాశ్ రెడ్డి, బుట్టా రేణుకలు, కువైట్ జైళ్లలో మరణదండన విధించబడిన భారతీయుల సంఖ్యపై ప్రశ్నించగా, వీకే సింగ్ సమాధానం ఇచ్చారు. వీరిలో అత్యధికులు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డారని పేర్కొన్నారు. మరణశిక్షలను జీవిత ఖైదుగా మార్చాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరామని, దీనిపై నిర్ణయం వెలువడాల్సి వుందని తెలిపారు.