: నాకు ప్ర‌తికూలంగా మీడియాలో ప్రచారం జరుగుతోంది: 50వ టెస్టు మ్యాచు ఆడేముందు మహ్మద్ హఫీజ్


పాకిస్థాన్ క్రికెట్ టీం ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కొద్ది సేప‌టి క్రితం పాక్‌-ఇంగ్లండ్ మ‌ధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మ‌యింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ టీం మొద‌ట ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభం ముందు పాకిస్థాన్‌ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ మీడియాతో మాట్లాడుతూ తనకు ప్ర‌తికూలంగా మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోందన్నాడు. ‘ఇంగ్లండ్ పర్యటనలో ప్రతి బ్యాట్స్‌మన్‌ స్లిప్స్ లో క్యాచిచ్చి ఔట్ కావ‌డం సాధార‌ణ‌మే, దానికి నేనేమీ మినహాయింపు కాదు. నా ఆట‌తీరు గురించి విమర్శలు చేస్తూ నాపై ఒత్తిడి తీసుకువ‌స్తున్నారు. ఈ తీరు మంచిది కాదు.. వాటిని పట్టించుకునే ఉద్దేశం నాకు లేదు’ అని వ్యాఖ్యానించాడు. త‌న సేవ‌లు వ‌న్డే, టీ20ల‌కు అవ‌స‌ర‌మ‌ని హఫీజ్ అన్నాడు. నేడు తాను 50వ టెస్టు ఆడుతున్నట్లు పేర్కొన్నాడు. త‌న ఆట‌తీరుని తన బ్యాటింగ్ సగటు చూస్తే తెలుస్తుంద‌ని అన్నాడు. మోకాలి గాయంతో బాధ‌ప‌డిన తాను కొన్ని సిరీస్ లకు దూర‌మ‌య్యాన‌ని ఇప్పుడు చాలా ఫిట్ గా ఉన్నాన‌ని పేర్కొన్నాడు. ‘ఐసీసీ నాకు క్లీన్ చిట్ ఇచ్చింది.. బౌలింగ్లో రాణిస్తా.. మళ్లీ ఫామ్‌లోకి వ‌స్తా’ అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News