: కోహ్లీ క్రికెట్ లో బిజీ...అనుష్క 'పొకెమాన్'లో బిజీ
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వెస్టిండీస్ టూర్లో క్రికెట్ ప్రాక్టీస్ లో నిమగ్నమై బిజీగా ఉన్నాడు. అతని లవర్ అనుష్క శర్మ కూడా బిజీగా మారిపోయింది. సుల్తాన్ సినిమాతో భారీ విజయం అందుకున్న అనుష్క శర్మ... యువతరాన్ని ఊపేస్తున్న రియాల్టీ మొబైల్ గేమ్ పోకెమాన్ గో ను ఆడడంలో బిజీగా ఉంది. ఈ మేరకు పోకెమాన్ గో గేమ్ ఆడుతుండగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన అనుష్క శర్మ.. అన్ని పొకెమాన్ లను పట్టేస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. షారూక్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం. మొత్తానికి బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా పోకెమాన్ గో గేమ్ ఆకట్టుకుంటోంది.