: ఫేమస్ అవ్వాలన్న పిచ్చితో తుపాకీతో కాల్చుకున్నాడు!
రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారాలంటే ఏదో ఒక పిచ్చిపని చేయాలని చాలామంది కుర్రాళ్లు భావిస్తున్నారు. అలా భావించిన ఓ యువకుడు చేసిన పని గురించి వింటే విస్మయం వ్యక్తం చేయకుండా ఉండలేరు. లండన్ కు చెందిన కాస్పర్ నైట్ అనే యువకుడు సోషల్ మీడియాలో అర్జెంటుగా ఫేమస్ అవ్వాలని భావించి ఎవరూ చేయని పని చేయాలని భావించాడు. దీంతో తుపాకీ తీసుకుని బయల్దేరాడు. ఎవరినైనా కాలిస్తే కేసవుతుందని భావించి, తన బుగ్గనే తాను కాల్చుకుంటానని, దానిని వీడియో తీయాలని పలువురిని కోరాడు. అయితే అందుకు ఎవరూ అంగీకరించలేదు సరికదా...చీవాట్లు పెట్టారు. దీంతో ఇలా కాదని భావించి, తన వీడియో తానే తీసుకుంటూ బుగ్గకు గురి పెట్టి తుపాకీతో కాల్చుకుని ఫేస్ బుక్ లో ఆ వీడియో పోస్టు చేశాడు. దీంతో అతను ఊహించినట్టుగానే సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయింది. మెజీషియన్ గా జీవితం ప్రారంభించాలని భావిస్తున్న కాస్పర్ కెరీర్ ప్రారంభించడానికి ముందే సోషల్ మీడియాలో ఫేమస్ కావడంపై హర్షం వ్యక్తం చేయగా, ఈ వీడియోపై వెల్లువెత్తిన ఫిర్యాదులతో అతని అకౌంట్ ను ఫేస్ బుక్ యాజమాన్యం సస్పెండ్ చేసింది.