: నాకే పాపం తెలియదు... ఈ దేశంలో ఇంతే!: డోపీ ఇంద్రజిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు


"ఈ దేశంలో ఇంతే. ఎవరైతే నోరు మెదుపుతారో వారికి ఇలాగే జరుగుతుంది. ఆనాడు భగత్ సింగ్ నుంచి నేడు ఇంద్రజిత్ వరకూ. ఈ వ్యవస్థ నాకెన్నడూ మద్దతివ్వలేదు" అని డోపింగ్ పరీక్షల్లో దొరికిపోయిన షాట్ పుట్ క్రీడాకారుడు ఇంద్రజిత్ సింగ్ వాపోయాడు. ఓ టీవీ చానల్ కు నేడు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, మార్కెట్లో అందుబాటులో ఉండే ఔషధాల విషయంలో తనకు సాయపడాలని ఎన్నోమార్లు అధికారులను కోరినప్పటికీ ఎన్నడూ తనకు సాయం దక్కలేదని, రియోలో తనకు పతకం వస్తే తానెక్కడ పాప్యులర్ అయిపోతానేమోనన్న భయంతో కొందరు కుట్ర పన్ని తనను ఇరికించారని అన్నాడు. తనకు స్పాన్సర్లు రాకుండా కొందరు అధికారులు అడ్డుకున్నారని ఆరోపించాడు. తానిచ్చిన శాంపిల్స్ ను మార్చేసి డోపీగా తేల్చారని వాపోయాడు. రియో ఒలింపిక్స్ లో పతక సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్న తనకు ఇది అతిపెద్ద నిరుత్సాహాన్ని కలిగించిందని అన్నాడు.

  • Loading...

More Telugu News