: రికార్డు నెలకొల్పిన కోహ్లీ... క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన విండీస్


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వెస్టిండీస్ పర్యటన ద్వారా రికార్డుల దిశగా దూసుకుపోతున్నాడు. అంటిగ్వాలో జరుగుతున్న తొలి టెస్టులో 27.4 ఓవర్ లో క్రీజులోకి వచ్చిన కోహ్లీ అద్భుతమైన సహనం చూపించాడు. సహచరులు వెనుదిరుగుతున్నా ఎలాంటి తొట్రుపాటు లేకుండా క్రీజులో కుదురుకున్నాడు. విండీస్ బౌలింగ్ ను ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో 281 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 24 ఫోర్లు బాదాడు. 71.17 స్ట్రయిక్ రేట్ తో 200 పరుగులు చేశాడు. ఇందులో 104 పరుగులు సింగిల్స్, డబుల్స్ ద్వారా తీసినవే కావడం కోహ్లీ ఫిట్ నెస్ కు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కోహ్లీ తన కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. అంతేకాదు, విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి టీమిండియా కెప్టెన్ గా కోహ్లీ రికార్డు పుటలకెక్కాడు. కోహ్లీ డబుల్ సెంచరీ చేయగానే వెస్టిండీస్ ఆటగాళ్లు క్రీడా స్పూర్తి ప్రదర్శించారు. కోహ్లీ వద్దకు వెళ్లి అంతా హ్యాండ్ షేక్ తో అభినందించారు. క్రీజులో వున్న సహచర ఆటగాడు అశ్విన్ ఆలింగనంతో అభినందించాడు. టీమిండియా చీఫ్ కోచ్ ఈ క్షణాలను కెమెరాలో బంధిస్తూ సందిడి చేయగా, కామెంటేటర్, టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ స్టాండింగ్ ఒవేషన్ తో అభినందించాడు. దీంతో టీమిండియా 404 పరుగుల వద్ద లంచ్ కు వెళ్లింది. ఇక కోహ్లీ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేస్తాడని అంతా భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News