: సెన్సార్ బోర్డులో అనర్హులు... వారికి ముద్దుకి, చెంపదెబ్బకి తేడా తెలియదు!: ధ్వజమెత్తిన బెంగాలీ దర్శకుడు


సెన్సార్ బోర్డులో అనర్హులను నియమించారని ప్రముఖ దర్శకుడు అంజన్ దత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాలీ సినిమా 'సాహిబ్ బీబీ గులామ్' సినిమాలో పలు సీన్లను తొలగించడంపై ఆయన మండిపడ్డారు. చుంబనానికి, చెంపదెబ్బకు తేడా తెలియని వారు, సినీ పరిజ్ఞానం లేనివారు సెన్సార్ బోర్డులో ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. చేతిలో కత్తెర ఉందని చెప్పి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా, సెన్సార్ బోర్డు చెప్పిన అభ్యంతరాలపై ఎఫ్ సీఏటీని ఆశ్రయించిన ఆ సినిమా దర్శకుడు ప్రతిమ్ డీ గుప్తా చిన్న, చిన్న కట్స్ తో సినిమాను ఆగస్టులో విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News