: ట్రంప్ కు షాక్!... అధ్యక్ష పదవికి అనర్హుడంటూ అమెరికా మహిళల ‘నగ్న’ నిరసన!
అమెరికా అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ఖరారైన ఆ దేశ రియల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్... తన సొంత పార్టీ నేతలతో పాటు యావత్తు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచారు. నోటికి అదుపు అంటూ లేని ట్రంప్... ప్రచారంలో భాగంగా పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ వ్యాఖ్యలపై మెజారిటీ అమెరికన్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న ఆయనకు వినూత్న నిరసన ఒకటి ఎదురైంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి అనర్హుడంటూ రోడ్డెక్కిన క్లీవ్ ల్యాండ్ మహిళలు... వందలాది మందిగా ఒక్కదరికి చేరి నగ్నంగా మారి వినూత్న నిరసనకు దిగారు. ఇదిలా ఉంటే... అమెరికా అధ్యక్ష బరికి జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఆ దేశానికి చెందిన పలు సంస్థలు చేసిన సర్వేల్లో ట్రంప్... డొమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కంటే చాలా వెనుకబడిపోయారు.