: ‘కబాలి’ టిక్కెట్లు హాట్ కేక్స్... రెండే రెండు గంటల్లో మొత్తం అమ్ముడుపోయాయి!


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రం టిక్కెట్లు కేవలం రెండే రెండు గంటల్లో మొత్తం అమ్ముడుపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా జులై 22వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. అమెరికాలో 400 స్క్రీన్లపై విడుదల కానున్న ‘కబాలి’ ముందస్తు బుకింగ్ టిక్కెట్లు రెండు గంటల్లో మొత్తం అమ్ముడు పోయినట్లు సమాచారం. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కలైపులి ఎస్ థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ‘కబాలి’ ఎయిర్ ఏషియా స్పెషల్ ప్యాకేజ్, ‘కబాలి’ యాప్, కబాలి ఇమోజీ, ‘కబాలి’ వెండి నాణేలు విడులైన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News