: గంటా కొడుకు హీరోగా 'కాళహస్తి' సినిమా ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు, మంత్రి నారాయణ అల్లుడు రవితేజ హీరోగా టాలీవుడ్ లో రంగప్రవేశం చేస్తున్నాడు. రవితేజ హీరోగా హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు దగ్గుబాటి సురేష్ బాబు క్లాప్ కొట్టగా; మాటల రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తపు షాట్ కు దర్శకేందుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాకు జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించనుండగా, దీనికి 'కాళహస్తి' అని పేరు ఖరారు చేశారు.