: గోడ కడితే కట్టుకో.. పో... ట్రంప్ కు దీటైన సమాధానమిచ్చిన మెక్సికో


తాను అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైతే, మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టిస్తానని రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మెక్సికో ప్రెసిడెంట్ పెనా నీటో స్పందించారు. రెండు దేశాల సరిహద్దుల్లో గోడ కట్టాలని భావిస్తే నిరభ్యంతరంగా కట్టుకోవచ్చని దీటైన సమాధానం ఇచ్చారు. అది అమెరికా ప్రభుత్వం అంతర్గత విషయమని, దాని వల్ల తమకు వచ్చే నష్టమేమీ ఉండబోదని అన్నారు. మెక్సికన్లు వలసదారులని, రేపిస్టులని, డ్రగ్ డీలర్లని ట్రంప్ చేసిన ఆరోపణలనూ నీటో ఖండించారు. హిట్లర్, ముస్సోలినీ వంటి నియంతల మనస్తత్వం ట్రంప్ కు ఉందని ఆరోపించారు. భద్రత, వాణిజ్యం తదితర అంశాల్లో ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో మాత్రమే తాముంటామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News