: వరుస పేలుళ్లతో వణికిన బాగ్దాద్... పలువురి మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో రద్దీగా ఉండే ఓ మార్కెట్లో వరుస పేలుళ్లు జరగడంతో 12 మంది మరణించారు. కరాదా - డిఖిల్, షల్లాల్ మార్కెట్ల వద్ద ఈ పేలుళ్లు జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఓ వ్యక్తి ఒంటినిండా బాంబులు కట్టుకుని వచ్చి ఆత్మాహుతి దాడి చేశాడని, తనను తాను పేల్చుకోవడంతో చుట్టుపక్కల ఉన్న 11 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో పలు వాహనాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఆపై కొద్దిసేపటికే షల్లాల్ మార్కెట్లో మరో పేలుడు సంభవించింది. ఓ ద్విచక్ర వాహనంలో బాంబులు అమర్చి దాన్ని పేల్చగా ఓ వ్యక్తి మరణించగా, మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు అధికారులు తెలిపారు.