: బెంబేలెత్తిస్తున్న ‘గుడ్డు’ ధర!... ఒక్కో గుడ్డు ఖరీదు రూ.5.50కు చేరిన వైనం!
పోషకాహారంలో అగ్రభాగాన నిలిచిన ‘గుడ్డు’ ధర చూస్తే గుడ్లు తేలేయాల్సిందే. ఎందుకంటే ఇటీవల క్రమంగా పెరుగుతూ వస్తున్న కోడి గుడ్ల ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఒక్కో గుడ్డు ఖరీదు రూ.5.50కు చేరింది. పౌల్ట్రీ మార్కెట్ లో ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇప్పటికే చికెన్ ధర ఆకాశాన్నంటింది. తాజాగా గుడ్డు ధర కూడా సామాన్యులు కొనలేని స్థాయికి చేరింది. పౌల్ట్రీ దాణా ధరలు పెరిగిన నేపథ్యంలోనే కోడి గుడ్ల ధరలు ఒకేసారి అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది.