: హీరో రానా ‘మెగా’ సెల్ఫీ... అదుర్స్!
సింగపూర్ లో జరుగుతున్నసౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల (సైమా) వేడుకలకు దక్షిణాది సినీ నటులు తరలి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, అల్లు అరవింద్, అర్జున్, హీరోయిన్లు సమంత, రాధిక, కుష్బూ, మంచు లక్ష్మీ ప్రసన్న తదితరులు హాజరయ్యారు. అలాగే, ఈ వేడుకకు దగ్గుబాటి రానా కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సహా పలువురి నటీనటులతో కలిసి దిగిన సెల్ఫీని రాణా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘ఈ సెల్ఫీ ఎన్నోమాటలు చెబుతుంది’ అనే క్యాప్షన్ తో రానా చేసిన ట్వీట్ ను పలువురు అభిమానులు పంచుకున్నారు.