: ‘జనతా గ్యారేజ్’లో గులాబీ కారు!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. దీనికి 'ఇక్కడ అన్నిరకాల వెహికల్స్ కు రిపేర్లు చేయబడును' అనే ట్యాగ్ లైన్ కూడా వుంటుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. కాగా, ఈ చిత్రం షూటింగ్ కోసం సారథి స్టూడియోస్ లో భారీ గ్యారేజ్ సెట్ కూడా వేశారు. అయితే, అక్కడి గ్యారేజీలో వున్న కార్లలో తాజాగా గులాబీ రంగు కారు ఒకటి దర్శనమిస్తోంది. ఏదైనా సీన్ నిమిత్తం ఈ కారును అక్కడ ఉంచారా? లేక వేరే కారణమేదైనా ఉందా? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News