: భారత్‌కు వీసాలు ఆపేయండి: ఒబామాను కోరిన సెనేటర్


భారత్, చైనా సహా 23 దేశాలకు ఇమ్మిగ్రెంట్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు జారీ చేయడాన్ని ఆపేయాలని కోరుతూ అమెరికాలోని ప్రముఖ సెనేటర్ ఒకరు అధ్యక్షుడు ఒబామా అడ్మినిస్ట్రేషన్ విభాగానికి లేఖ రాశారు. యూఎస్‌లో అక్రమంగా ఉంటున్న వలసదారులను తిరిగి వెనక్కి తీసుకెళ్లడంలో ఆయా దేశాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, అమెరికాకు అస్సలు సహకరించడం లేదని అందులో ఆరోపించారు. హంతకులతోపాటు కరుడు గట్టిన నేరస్తులు ఎందరో ప్రతీరోజూ విడుదలవుతున్నారని, వారిని వెనక్కి తీసుకెళ్లడంలో ఆయా దేశాలు ఆసక్తి చూపడం లేదని రిపబ్లికన్ సేనేటర్ సెనేట్ చక్ గ్రాస్సెలీ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ జే జాన్సన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఒక్క 2015 ఆర్థిక సంవత్సరంలోనే 2,166 మంది విడుదల కాగా రెండేళ్లలో 6,100 మందికిపైగా విడుదలయ్యారని ఆయన తెలిపారు. అక్రమ వలసదారులను తిరిగి తమ దేశానికి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం వహించడంతోపాటు అమెరికాకు సహకరించని 23 దేశాల పేర్లను పేర్కొన్న సెనేటర్ టాప్-5లో క్యూబా, చైనా, సోమాలియా, ఇండియా, ఘనా పేర్లను పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News